శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాత్రి భోజనం తర్వాత నడక మంచిదే!

52 నిమిషాల క్రితం

nit
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 04:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

రాత్రిపూట భోజనం తర్వాత కాసేపు టీవీ లేక ఫోన్ చూసి పడుకోవడం చాలామందికి సాధారణమైన అలవాటుగా మారిపోయింది. కొంతమంది అయితే తిన్న వెంటనే పడుకుంటారు. ఇలా చేస్తే తిన్న ఆహారం జీర్ణమవ్వడం కష్టమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట భోజనం అనంతరం 10 - 15 నిమిషాల పాటైనా నడిస్తే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

* రాత్రి భోజనం తర్వాత వాకింగ్ మధుమేహస్తులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. భోజనం తర్వాత నడవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిల్ని నియంత్రించుకోవచ్చు అని వైద్యులు వెల్లడించారు.

* రోజులో ఏదో ఒక సమయంలో వ్యాయామం చేయాలని నియమం పెట్టుకోవడం మంచిదే. కానీ ఫిక్స్‌డ్ టైమ్ వ్యాయామం అన్నది సరైనది కాదు. ఏ సమయంలోనైనా వీలు చూసుకుని శరీర కదలికల కోసం ప్రయత్నిస్తే మంచిదని వైద్యులు సూచించారు.

* రాత్రి భోజనం తర్వాత గంటసేపు వ్యాయామం చేయనక్కర్లేదు. కేవలం ఓ 10-15 నిమిషాలు నడిస్తే చాలు. ఈ కొద్దిపాటి వ్యాయామం మీ జీర్ణక్రియకు ఎంతో సహాయపడుతుంది. ఆ సమయంలో ఉదయంపూట నడకలాగా వేగంగా నడవకూడదు. అలా చేస్తే మీ హార్ట్ రేట్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వేగంగా కాకుండా నెమ్మదిగా నడవాలి.

* పడుకోబోయే ముందు ఫోన్‌లో మెసేజ్‌లు చూసి అదే ఆలోచిస్తూ ఉండకుండా.. కాసేపు మీకిష్టమైన పాటల్ని విన్న తర్వాత నిద్రకు ఉపక్రమించాలి. ఈ అలవాటు వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల ఉదయం నిద్ర లేచిన తర్వాత చాలా యాక్టివ్‌గా ఉంటారు. మీరు చేయాల్సిన పనులు చకచకా చేసుకుంటారు.

* మీ అనారోగ్య సమస్యలకు చికిత్సలో భాగంగా రాత్రి భోజనం తర్వాత మందులు వేసుకునేవారు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించిన తర్వాతే వాకింగ్ చేయాలి. టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కొంతమందికి తలతిరుగుతున్నట్లుగా ఉంటుంది. ఆ సమయంలో వాకింగ్ చేస్తే గుండెపోటు వచ్చే ప్రమాదముంది. ఎలాంటి మందులు వాడని వారు నడక చేస్తే మంచిదని వైద్యులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్