ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో... 25 మోటార్ సైకిళ్లు సీజ్

1 గంట క్రితం

25 motorcycles seized during cordon and search operation.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 03:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు కాకినాడ ఇంచార్జ్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, కాకినాడ అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) డాక్టర్ మహంతి కిషోర్ కుమార్ పర్యవేక్షణలో పోర్ట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి సునీల్ నేతృత్వంలో పట్టణ సీఐలు, ఎస్సైలు, ఈగల్ టీమ్, పోలీస్ సిబ్బందితో కలిసి ఆదివారం పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టిడ్కో గృహ సముదాయం వద్ద కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా అనుమానాస్పద వ్యక్తులు, పాత నేరస్తులు, గంజాయి, నాటుసారా వంటి మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం కొరకు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అదేవిధంగా వాహనాల తనిఖీల్లో సరైన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి ధ్రువపత్రాలు లేని 25 మోటార్ సైకిళ్లను గుర్తించి సీజ్ చేసి, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, గంజాయి, నాటుసారా తదితర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టడం, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడం, ప్రజలకు భద్రత కల్పించడంలో భాగంగా ఇటువంటి కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి సమాచారం తెలియజేయుటకు 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని, అత్యవసర సహాయం కొరకు 112 కు కాల్ చేయాలని, సైబర్ నేరాలకు గురైనట్లయితే 1930 కు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఒకటవ పట్టణ ఇన్స్పెక్టర్ ఎం నాగ దుర్గారావు, కాకినాడ మూడవ పట్టణ ఇన్స్పెక్టర్ కె వి ఎస్ సత్యనారాయణ, ఎస్సైలు, ఈగల్ టీం అధికారులు, పట్టణ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్