శనివారం, 08 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

శ్రీ చైతన్య యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

1 గంట క్రితం

Action must be taken against the Sri Chaitanya management.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 05:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - జగ్గంపేట (కాకినాడ) : శ్రీ చైతన్య జూనియర్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్ ఎఫ్ఐ మండల నాయకులు కార్తీక్, పిడిఎస్యు (విజృంభణ) రాష్ట్ర కార్యదర్శి కె సతీష్ డిమాండ్ చేశారు. శనివారం జగ్గంపేటలో విద్యార్థులు నిరసన చేసి మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి రూ. 50 లక్షలు ఇవ్వాలన్నారు. కాకినాడ రామారావు పేటకు చెందిన శ్రీ చైతన్య జూనియర్ కళాశాల యాజమాన్యం ఫీజులు కట్టమని పదేపదే ఒత్తిడి చేయడంతో అజయ్ అనే విద్యార్థి మృతి చెందారన్నారు. తక్షణమే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జిల్లా కలెక్టర్ విద్యార్థి మరణం పై సమగ్ర విచారణ చేపట్టి, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్ టి యు ఉమ్మడి జిల్లా కార్యదర్శి కుంచె అంజిబాబు, విద్యార్థులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్