ప్రజాశక్తి-కాకినాడ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంజీవిని–టాటా డిజిటల్ ఇంటిగ్రేటెడ్ నెట్‌వర్క్ ఫర్ కేర్ ప్రాజెక్టును 2027 జనవరి 1 నుంచి కాకినాడ జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ .... ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలల వరకు డిజిటల్ వైద్య సేవలను అనుసంధానం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమన్నారు. స్పెషలిస్ట్ వైద్యులతో వర్చువల్ సంప్రదింపులు, ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్లు, రిఫరల్ సేవలు, డిజిటల్ హెల్త్ రికార్డులు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. జిల్లాలోని 65 ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రజలకు ఏబీహెచ్ఏ ఐడీలు సృష్టించి డిజిటల్ ఆరోగ్య రికార్డులతో అనుసంధానం చేయాలని, పేషెంట్ కేర్ కోఆర్డినేటర్లుగా సంజీవిని మిత్రలను నియమించాలని ఆదేశించారు. ప్రాజెక్టు అమలును పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ, ఏపీఎంఎస్‌ఐడీసీ, టాటా సంస్థ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీఎంఎంహెచ్‌ఓ డాక్టర్ అనిత, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ మహేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జనవరి 1 నుంచి సంజీవిని ప్రాజెక్టు అమలుకు ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 11, 2026, 04:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)