...ఏపీ నుంచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
...బంగారు పతాక విజేత అనుసూరి ఆశ్రితను అభినందించిన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్
ప్రజాశక్తి-కాకినాడ : పాఠశాల క్రీడల సమాఖ్య (ఎస్.జీ.ఎఫ్.ఐ) ఆధ్వర్యం లో నెల్లూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో కరప మండలం కూరాడ గ్రామానికి చెందిన విద్యార్థిని అనుసూరి ఆశ్రిత ప్రతిభ చాటింది.ఈ నెల 14 నుండి 16 వరకు నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో అండర్-17 బాలికల రైఫిల్ షూటింగ్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. కాకినాడ లోని మోహన్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆశ్రిత,ఈ విజయంతో త్వరలో గోవాలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించే అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో మంగళ వారం ఆశ్రిత తన తల్లిదండ్రులతో కలిసి కాకినాడ కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిసింది. రాష్ట్ర స్థాయిలో బంగారు పతకం సాధించిన ఆశ్రీతకు కలెక్టర్ ప్రత్యేక అభినందన లు తెలియజేశారు.ఇదే స్ఫూర్తితో,మరింత పట్టుదలతో సాధన చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించాలన్నారు. భవిష్యత్తులోను మరిన్ని విజయాలు సాధించి కాకినాడ జిల్లాకు మంచి పేరు తీసుకు రావాలని ఆయన ఆకాంక్షించారు.







కామెంట్‌లు (0)