శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కాకినాడ తీర ప్రాంత రక్షణకు కేంద్రం కీలక చర్యలు

3 రోజుల క్రితం

Centre takes key measures to protect Kakinada's coastal region.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 12, 2026, 04:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ప్రశ్న కు కేంద్రమంత్రి లిఖిత పూర్వక సమాధానం


ప్రజాశక్తి-కాకినాడ : సముద్ర మట్టం పెరుగుదల, తీరప్రాంత కోత, తుఫాన్లు, వరదలు వంటి వాతావరణ మార్పుల ప్రభావాల నుంచి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం శాస్త్రీయ అధ్యయనాలు, పర్యవేక్షణ చర్యలు చేపడుతోందని కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మంత్రి డా. జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ అంశంపై బుధవారం కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా 36.2 శాతం తీరరేఖ కోతకు గురవుతుండగా, 37.8 శాతం స్థిరంగా, 26 శాతం తీరరేఖ సముద్రం వైపు విస్తరిస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడించినట్లు మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో తుఫాన్లు, రుతుపవన వరదలు, సముద్ర మట్టం పెరుగుదల, తీవ్ర వాతావరణ పరిస్థితులు తీర కోతకు ప్రధాన కారణాలుగా గుర్తించామని, ఎపి లో ప్రకాశం, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలను తీర ప్రమాదాలకు సాపేక్షంగా అధికంగా గురయ్యే ప్రాంతాలుగా, అలాగే యానాం, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు తీర ప్రాంతాలను పలు రకాల తీర ప్రమాదాలకు అధికంగా గురయ్యే ప్రాంతాలుగా గుర్తించామని ముఖ్యంగా కాకినాడ తీరప్రాంత రక్షణకు సంబంధించి కేంద్రం కీలక చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు షోర్ లైన్ మేనేజ్మెంట్ ప్లాన్ సిద్ధం చేయడంతో పాటు కాకినాడ, విశాఖపట్నం తీర రక్షణ పనులకు సంబంధించిన రెండు డిపిఆర్ లను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ సహా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత ప్రజల భద్రత, తీరప్రాంత పరిరక్షణకు శాస్త్రీయ ఆధారిత చర్యలు మరింత బలోపేతం కావడానికి ఈ చర్యలు దోహదపడనున్నాయని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్