ప్రజాశక్తి - జగ్గంపేట (కాకినాడ) : ఏపీ విఆర్ఏల జెఏసి ఇచ్చిన పిలుపుమేరకు చేపట్టిన సమ్మె ఆదివారం 5 వ రోజు కొనసాగింది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ తహసీల్దార్ కార్యాలయం వద్ద సహాయ నిరాకరణ పోరాటం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు నిడమర్తి సురేష్ ఇశ్రాయేల్ మాట్లాడుతూ ... పేస్కెల్ అమలు చేయాలని, నామిని విఆర్ఏ లను రెగ్యులర్ చేయాలని, అర్హులకు ప్రమోషన్ ఇవ్వాలని, ప్రమోషన్ కోటాను 30 నుండి 70 శాతానికి పెంచాలని, కారుణ్య నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారం చేసేవరకు ఈ పోరాటం ఆగదన్నారు. వెంటనే ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం డివిజన్ ఉపాధ్యక్షులు వార చిట్టిబాబు, మండల వి ఆర్ ఏ ల అధ్యక్షలు పి. ఇస్సాకు, కార్యదర్శి పిట్టా మౌళి, జాయింట్ సెక్రటరీ , ప్రభావతి, తదితర విఆర్ఏ లు పాల్గొన్నారు.
5 వ రోజు - విఆర్ఏ ల సమ్మె
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 01:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)