ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భారీ వర్షాల నేపథ్యంలో డ్రైనేజీలపై ప్రత్యేక దృష్టి సారించాలి : కమిషనర్ ఎన్.వి.వి.సత్యనారాయణ

5 రోజుల క్రితం

In view of heavy rains special attention must be paid to drainage systems Commissioner NVV Satyanarayana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 03:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు


ప్రజాశక్తి-కాకినాడ : రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో కాకినాడ సినిమా రోడ్డులోని ఆనందభారతి గ్రౌండ్స్ వద్ద నుంచి కల్పన సెంటర్ వరకు ఉన్న ప్రధాన డ్రైనేజీని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర అడ్డంకులను తక్షణమే తొలగించాలని, సరస్వతి గానసభ, చాణిక్య చంద్రగుప్త థియేటర్ , ఆనంద్ భారతి గ్రౌండ్స్, ప్రాంతాలతో పాటు నీరు నిలిచే ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. డ్రైనేజీల్లో వ్యర్థాలు వేస్తున్న హోటళ్లు, టీ దుకాణాల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పద్మనాభనగర్, దుమ్ముల పేట, మహాలక్ష్మీ నగర్, సూర్యనారాయణ నగర్, శ్రీనగర్, చైతన్యనగర్, ట్రెజరీ కాలనీ తదితర లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ఎస్‌ఈ పి. వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, ఈఈలు కనకరాజు, అర్జున్, డి. లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్