ప్రజాశక్తి-కాకినాడ : స్టైఫండ్ పెంపు అంశంలో ప్రభుత్వ తాత్సారాన్ని నిరసిస్తూ .... ఎపి జూనియర్ వైద్యుల అసోసియేషన్ ఆధ్వర్యంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన 800 మంది జూనియర్ డాక్టర్లు రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపట్టారు. జిజిహెచ్ ఎదురుగా ఉన్న ఆర్ఎమ్సీ హాస్టల్ లో బుధవారం దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎపి జూడా అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.కె.రమేష్ మాట్లాడుతూ .... మంగళవారం ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె ప్రారంభించామని తెలిపారు. ఇప్పటికే స్టైఫండ్ పెంపు 8 నెలలు ఆలస్యం అయిందన్నారు. తమ స్ట్రైపండ్ ను 30 శాతం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేని పరిస్థితుల్లో గత రాతపూర్వక ఒప్పందం ప్రకారం 15 శాతం పెంపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బుధవారం నుంచి సమ్మెను ఉదృతం చేస్తున్నామని తెలిపారు. ఈనెల 15 లోగా ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వకపోతే అత్యవసర వైద్య సేవలను కూడా నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ, లేబర్ రూమ్ సేవలు మినహా ఇతర సేవలు అందించే పీజీలు, ఇంటెన్సీ, సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే జూనియర్ వైద్యులు సమ్మెలో పాల్గొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జూడా అసోసియేషన్ ఆర్ ఎమ్ సీ ఉపాధ్యక్షుడు డా.టిఎన్.అశ్విన్ కుమార్, ప్రధాన కార్యదర్శి డా.తనూజ, ఫార్మసీ జూడా డా.రాజర్షి దాస్, ఆర్ ఎమ్ సీ జూడా ఉపాధ్యక్షురాలు డా.సింధూజ, డా.మేరి గ్రేస్, పీజీలు, జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు.
స్టైఫండ్ పెంపు కోరుతూ .... జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 12, 2026, 04:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)