ప్రజాశక్తి-కాకినాడ : మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడలో బ్రాంచిలో నూతనంగా ఏర్పాటు చేసిన హై డిపెండెన్సీ యూనిట్ బుధవారం పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ ఆధునిక వైద్య సదుపాయాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్న మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యాన్ని అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో, క్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు హై డిపెండెన్సీ యూనిట్ ఎంతో ఉపయోగపడుతుందని, అత్యాధునిక పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్యులు, శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బందితో ఈ హై డిపెండెన్సీ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం హాస్పిటల్ కాకినాడ సెంటర్ హెడ్ నందికోళ్ళ అంజిబాబు మాట్లాడుతూ .... పెద్దాపురం నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లా వ్యాప్తంగా, అలాగే కోనసీమ జిల్లాల్లోని అనేక మంది ప్రజలకు ఆరోగ్య సమస్యలు, శస్త్రచికిత్సల అవసరాల సమయంలో తన సొంత డబ్బులతో వైద్య సహాయం అందించిన వ్యక్తి నిమ్మకాయల చినరాజప్ప అని అన్నారు. కాకినాడ, పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో హై డిపెండెన్సీ యూనిట్ (హెచ్డియూ)ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించేందుకు మెడికవర్ హాస్పిటల్స్ నిరంతరం కృషి చేస్తుందని అంజిబాబు తెలిపారు.
నమ్మకంతో కూడిన వైద్యం అందించాలి : ఎమ్మెల్యే చినరాజప్ప
9 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 29, 2026, 03:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)