మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వారణాసిలో పేలిన ప్రయాణికుడి తుపాకీ.. ఇద్దరికి గాయాలు

16 ఆగస్టు, 2026

Air India Express
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 01:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

లక్నో : వారణాసిలోని లాల్‌బహదూర్‌శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడి వద్ద ఉన్న తుపాకీ పేలింది. ఆదివారం ఉదయం 9.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

వివరాల ప్రకారం .. అజంగఢ్‌కు చెందిన ఆ ప్రయాణికుడు తన భార్యతో IX-1810 ఎయిరిండియా విమానంలో ముంబయి వెళుతున్నాడు. అతను తన వద్ద తుపాకీ ఉందని అధికారులకు తెలిపాడు. ఆయుధాల తనిఖీ సమయంలో ఒక రౌండ్‌ కాల్పులు జరపడంతో , పిస్టల్‌ నుండి దూసుకువచ్చిన తూటా నేలను తాకి, బ్యాగేజ్‌ స్క్రీనింగ్‌ కోసం లైన్‌లో నుంచున్న ఒక యువకుడికి, మహిళకు తగిలింది. మహిళ తొడకు, యువకుడి చేతికి బుల్లెట్ గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరినీ ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చినట్లు వారణాసి విమానాశ్రయ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్