ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆల్ ఈజ్ వెల్ స్వచ్ఛంద సేవా సంస్థచే మొక్కలు నాటే కార్యక్రమం

1 గంట క్రితం

kakinada-1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 04:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కాకినాడ : హరిత కాకినాడ కోసం స్థానిక పళ్ళంరాజు నగర్ లో ఆల్ ఈజ్ వెల్ సభ్యులచే మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఈజ్ వెల్ వ్యవస్థాపకులు కిషోర్ మాట్లాడుతూ .. కాకినాడను పచ్చని, అందమైన నగరంగా తీర్చిదిద్దడంలో తమ సంస్థ నిరంతరం శ్రమిస్తోందని, తమ సంస్థ కు అటవీశాఖచే వంద మొక్కలు వచ్చాయని ఇవి కాకినాడ లోని పలు చోట్ల వేయడానికి సంకల్పించామన్నారు. కాకినాడ నగరాన్ని హరిత నగరం గా తయారు చేయడానికి కృషి చేస్తున్నమన్నారు. ఆల్ ఈజ్ వెల్ సభ్యులు, దంత వైద్యులు డా అడ్డాల మాట్లాడుతూ.. కాకినాడ లో ఉన్న పలు కళాశాలల విద్యార్థుల తో తాము ఏర్పాటు చేసిన జెన్ గ్రీన్ మంచి ఫలితాలు ఇస్తుందని అన్నారు. మానవులకు వృక్షాలు అవసరమైన ప్రాణవాయువును (ఆక్సిజన్) అందించి, కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకుంటాయని, ఉష్ణోగ్రతలను తగ్గించడంలోనూ, సరైన సమయంలో వర్షాలు పడటంలోనూ చెట్లు కీలక పాత్ర పోషిస్తాయని, పచ్చని వాతావరణాన్ని అందించాలనే సంకల్పంతో ఆల్ ఈజ్ వెల్" సభ్యులు చేస్తున్న ఈ నిరంతర కృషి కాకినాడ నగరవాసులందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం ఆని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఈజ్ వెల్ ఉపాధ్యక్షులు డాక్టర్ రాజకుమార్, కార్యదర్శి టి.వి.వి.ఎస్.ఎన్ రెడ్డి, డాక్టర్ రవివర్మ, విక్రమ్, రాజేంద్ర, శ్రీనివాసు, వెంకటనారాయణ, సీనియర్ సిటిజన్లు కృష్ణారావు, స్వామి తదితరులు పాల్గొన్నారు. సుమారు 30 మంది జెన్ గ్రీన్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి సేవలు అందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్