ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ నగరంలో ఓ వ్యక్తి హత్యకు కారణమైన ఇద్దరు ట్రాన్స్ జెండర్లను కాకినాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను త్రీటౌన్ సిఐ కెవిఎస్ సత్యనారాయణ వెల్లడించారు. కాకినాడ 3 టౌన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల జ్యోతుల కాలనీ తోటమ్మవారి వీధిలో ఈ నెల 3వ తేదీన జరిగిన వ్యక్తి హత్యలో ఇద్దరు ముద్దాయిలు(ట్రాన్స్ జెండర్లు) అరెస్ట్ చేసినట్లు 3వ పట్టణ సిఐ కెవిఎస్ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం త్రీ టౌన్ శాంతి భద్రతల పోలీసు స్టేషన్లో ఆయన మీడియాతో వివరాలు వెల్లడించారు. స్థానిక జ్యోతుల కాలనీ తోటమ్మవారి వీధిలో కర్నూలు జిల్లా కల్లూరు గ్రామానికి చెందిన ఇద్దరు ట్రాన్స్ జెండర్లు సాయిపోగు కిరణ్మయి (జెస్సీ), రెడ్డిపోగు అజయ్ కుమార్ (పప్పీ) కలసి తన బాబాయి అయిన రాజు శివ అనే వ్యక్తిని త్రీవంగా కొట్టారని, గాయాలతో పడి ఉన్న అతన్ని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చినామని అతని పరిస్తితి విషమంగా ఉందని అతన్ని కొట్టిన జెస్సీ, పప్పీలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని రాజు రాజేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారని సిఐ చెప్పారు. కేసు విచారణ జరుగుతుండగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజు పరిస్థితి విషమించి 6వ తేదీన మరణించడంతో దానిని హత్య కేసుగా నమోదు చేసి మరణానికి కారణమైన ముద్దాయిలను త్వరితగతిన గుర్తించి అరెస్టు చేశామని తెలిపారు. గురువారం పోర్ట్ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండగా పట్టుకున్నట్లు సిఐ చెప్పారు. ముద్దాయిలు జెస్సీ, పప్పీలను కోర్టులో హాజరు పరుస్తామన్నారు. ముద్దాయిలు కొంత కాలం క్రితం ట్రాన్స్ జెండర్లుగా మారి వారి వృతిలో భాగంగా కాకినాడ సిటీ పరిసర ప్రాంతాలలో షాపుల వద్ద డబ్బులు తీసుకుంటూ, భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నారన్నారు. మృతుడు రాజు శివ (41) నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో బాత్రూమ్లు శుభ్రం చేసుకుంటూ జీవించేవాడన్నారు. రాజు శివకు ఇంకా వివాహం కాలేదని, అతను అప్పుడప్పుడూ ముద్దాయిలతో కలసి భిక్షాటనకి కూడా వెళ్ళేవాడన్నారు. ఇదే క్రమంలో ఈ నెల 3వ తేదీన డబ్బుల విషయమై మృతునికి, ముద్దాయిలకు జరిగిన గొడవలలో ట్రాన్స్ జెండర్లు ఇద్దరు కలసి రాజు శివను ఇష్టానుసారంగా కాళ్లతో వృషణాలపై తన్నడం, చేతులతోనూ, కర్రతోను, సిమ్మెంటు రాయితోను దవడపై తీవ్రంగా కొట్టడం వలన తీవ్ర రక్తస్రావం జరిగి మరణించినట్లు విచారణలో తేలిందన్నారు. ముద్దాయిలను పట్టుకున్న త్రీ టౌన్ లా అండ్ ఆర్థర్ పోలీసు స్టేషన్ ఎస్సై ఎం సాగర్ బాబు, హెడ్ కానిస్టేబుల్స్ సి పాలు, ఎ సతీష్, కానిస్టేబుల్స్ టి మురళీరాజు, కే శ్రీనివాస్ దర్యాప్తులో పాల్గొన్న క్రైమ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ అభినందించినట్లు సిఐ సత్యనారాయణ తెలిపారు.
వ్యక్తి హత్య కేసులో ఇద్దరు ముద్దాయిలు అరెస్టు
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 14, 2026, 04:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)