ప్రజాశక్తి-కాకినాడ : తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ .... ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం (వీఆర్ఏ) ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో విఆర్ఎ లు ధర్నా నిర్వహించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సమస్యలను, ఇబ్బందులను తొలగించాలని కోరుతూ ఈ ధర్నా చేపట్టారు. వీఆర్ఏలకు తగిన భద్రత హక్కులు కల్పించాలని, అర్హత కలిగినవారికి పదోన్నతులు, ఉద్యోగం పురోగతి అవకాశాలు ఇవ్వాలన్నారు. అలాగే వీఆర్ఏ ల వారి కుటుంబాల భవిష్యత్తు రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 20 ఏళ్లుగా ఎటువంటి పదోన్నతి లేకుండా తాము తక్కువ వేతనంతో పనిచేస్తున్నామని చెప్పారు. రికార్డ్ అసిస్టెంట్లుగా ఉద్యోగ పదోన్నతి కల్పించి స్కేలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం జిల్లా కలెక్టర్'కు సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు సురేష్ ఇజ్రాయిల్, ప్రధాన కార్యదర్శి చినబాబుజీల ఆధ్వర్యంలో అందించారు. ఈ ధర్నాకు పలువురు వీఆర్వోలు మద్దతు ప్రకటించారు.
సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ... వీఆర్ఏ ల ధర్నా
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 12, 2026, 04:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)