శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని 12న కలెక్టరేట్‌ వద్ద అఖిలపక్ష ధర్నా

1 గంట క్రితం

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని
12న కలెక్టరేట్‌ వద్ద అఖిలపక్ష ధర్నా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 08:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కాకినాడ

​కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని కోరుతూ ఈనెల 12వ తేదీ సోమవారం ఉదయం 10గంటలకు కాకినాడ కలెక్టరేట్‌ వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని అఖిలపక్షం పిలుపునిచ్చింది. సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాద్ అధ్యక్షతన శనివారం సుందరయ్య భవన్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సిపిఐ (ఎమ్ఎల్) లిబరేషన్ నాయకుడు గొడుగు సత్యనారాయణ మాట్లాడుతూ ధర్నాను విజయవంతం చేయాలని ప్రతిపాదించారు. జనశక్తి జిల్లా నాయకుడు వల్లూరి రాజబాబు, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు వింజమళ్ల చిట్టిబాబు మాట్లాడుతూ అంబేద్కర్‌ విగ్రహం నుంచి ప్రదర్శన ప్రారంభించాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు తాళ్లూరి రాజు, ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకుడు తోకల వరదరాజు, సిపిఐ నాయకుడు రామకృష్ణ, న్యాయవాది సుధీర్‌, రిపబ్లికన్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామేశ్వరరావు మాట్లాడుతూ జనసేన, యువజన, విద్యార్థి సంఘాల కార్యకర్తలను కూడా కార్యక్రమానికి ఆహ్వానిస్తామని తెలిపారు.

సిపిఎం కాకినాడ రూరల్‌ కమిటీ కన్వీనర్‌ తిరుమలశెట్టి నాగేశ్వరరావు, కాకినాడ నగర పార్టీ నాయకుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ పలు ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి ధర్నా లక్ష్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. బిఎస్పి నాయకుడు సుబ్బు మాట్లాడుతూ ఫలితాలను తారుమారు చేసి గెలిచినట్లు ప్రకటించుకున్నారని ఆరోపించారు. సమావేశంలో నరాల శివ, వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి కమిటీ సత్య శ్రీనివాస్‌ పౌలు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మోర్త రాజశేఖర్‌, సిపిఎం సీనియర్ నాయకులు దువ్వా శేష బాబ్జీ, తదితరులు పాల్గొన్నారు.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్