ప్రజాశక్తి విజయవాడ సిటీ
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, చేపట్టిన ఏర్పాట్లను దేవాదాయ శాఖ కార్యదర్శి కే. కన్నబాబు శనివారం సాయంత్రం పరిశీలించారు. టోల్‌గేట్ నుంచి అమ్మవారి ఆలయం వరకు ఉన్న క్యూ లైన్లను పరిశీలించి, భక్తుల రాకపోకలకు చేసిన ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అనంతరం యాక్సిస్ గేట్ల పనితీరును పరిశీలించి, వాటి ద్వారా భక్తుల రాకపోకలను నియంత్రిస్తున్న తీరుపై ఆరా తీశారు. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ పరిసర ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. దసరా ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించారు.ఈ కార్యక్రమంలో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్.ఎస్. చంద్రశేఖర్ ఆజాద్, ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.










కామెంట్‌లు (0)