శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయమే లక్ష్యంగా సమన్వయంతో పని చేయాలి

35 నిమిషాల క్రితం

విజయమే లక్ష్యంగా సమన్వయంతో పని చేయాలి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 05:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - సామర్లకోట

​మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కలసి పని చేయాలని పెద్దాపురం ఎంఎల్ఎ నిమ్మకాయల చినరాజప్ప పిలుపునిచ్చారు. సామర్లకోట యార్లగడ్డ సుబ్బారావు రైతు భవన్లో శుక్రవారం కూటమి నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన, డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పాల్గొని ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ చినరాజప్ప మాట్లాడుతూ కూటమి నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పని చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతూ, ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

​డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ కూటమి శ్రేణులన్నీ సమష్టి కృషితో ముందుకు సాగాలని, ఎన్నికల సమన్వయానికి ప్రాధాన్యమిస్తూ ప్రజలకు చేరువ కావాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పని చేస్తూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మకాయల రంగనాగ్, సామర్లకోట మున్సిపల్ చైర్మన్ పదవికి కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న పిట్టా జానకిరామారావు, నాయకులు బడుగు శ్రీకాంత్, యార్లగడ్డ చిన్ని, అందుగుల జార్జ్ చక్రవర్తి, కంటే జగదీశ్ మోహన్, సామర్లకోట సొసైటీ అధ్యక్షులు పైన్నీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్