శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

36 నిమిషాల క్రితం

గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 05:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - వజ్రపుకొత్తూరు

గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి నరేష్ అన్నారు. మండలంలోని వెంకటాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందులు, ల్యాబ్, టీకాలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రి ఆవరణలో పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి సూచించారు. ఫ్రైడే డ్రై డే పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు ఎం.సంపతిరావు, పి.దేవి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్