శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు

35 నిమిషాల క్రితం

పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 05:20 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ముమ్మిడివరం

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండి, ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నోడల్ ఆఫీసర్ దుండి రాంబాబు పేర్కొన్నారు . ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని స్థానిక వెలుగు కార్యాలయం నందు శుక్రవారం ముమ్మిడివరం, అమలాపురం నియోజకవర్గ పరిధిలోని ముమ్మిడివరం,ఐ పోలవరం,కాట్రేనికోన,ఉప్పలగుప్తం,అల్లవరం, అమలాపురం, అమలాపురం మున్సిపాలిటీ మరియు ముమ్మిడివరం నగర పంచాయతీలకు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందాల సభ్యులకు నిర్వహించిన శిక్షణ శిబిరానికి రాంబాబు అధ్యక్షత వహించి మాటాడారు. మున్సిపల్, ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలతో పాటు త్వరలో జరగబోవు గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి సక్రమంగా అమలు జరిగేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉల్లంఘిస్తే తీసుకునే చర్యలను వివరించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందాలు ఎన్నికలు సమర్థవంతంగా, సజావుగా జరిగేలాచుడాలన్నారు.ప్రతి గ్రామంలోనూ పర్యటించి ఎక్కడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనకు అవకాశం లేకుండా చూడాలన్నారు. స్టాటిటిక్ సర్వేలెన్సు బృందాలు చెక్ పోస్టుల వద్ద నిఘా ఏర్పాటు చేసి రూ .10 వేలకు మించి వస్తువులు రవాణా చేసినా, రూ.50 వేలు మించి నగదు తీసుకువెళ్తున్న లేదా భారీ స్థాయిలో వస్తువులు రవాణా జరుగుతున్నా, నిరంతరం వాహనాలు తనిఖీ చేసి వాటి రసీదులను పరిశీలించాలని, నిబంధనల ప్రకారం లేని వాటిని సీజ్ చేసి పోలీసు డిపార్టుమెంటు వారికి అందించాలన్నారు. అలాగే ట్రెజరీ డిపార్ట్మెంట్, ఇన్ కం టాక్స్, ఎక్సైజ్ శాఖ లకు అప్పగించి కేసులు నమోదు చేయించాలన్నారు. అదే విధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ మండలంలో విస్తృతంగా పర్యటించి ఏ సమస్య వచ్చిన వెంటనే స్పందించి, పరిశీలించి ఎప్పటికప్పుడు జిల్లా స్థాయిలో కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సెల్ తెలియజేయాలన్నారు. నివేదికలను ఎప్పటికప్పుడు అందించాలని, మూడు టీమ్ లు ప్రతిరోజు రిపోర్టులను జిల్లా స్థాయికి నివేదించాలని, ఎన్నికల ప్రశాంతంగా, శాంతియుతంగా జరిగేలా సన్నద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అధికారి, ఆరు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు చెందిన బృందాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్