ప్రజాశక్తి - యానాం
సేవా సంకల్ప్ అభియాన్, నషా ముక్త్ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా యానాం పోలీస్ శాఖ, మిషన్ శక్తి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక గిరియాంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాదకద్రవ్యాల నివారణపై విద్యార్థులకు అవగాహనా సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ సురేష్ బాబు పాల్గొని పోక్సో చట్టం, మాదకద్రవ్యాల నేరాలు, శిక్షల గురించి వివరించారు. ఎస్ఐ కుమారన్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. మిషన్ శక్తి జిల్లా కో ఆర్డినేటర్ ఆల్బర్ట్ రిప్కా రోసెలిన్ విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి, బాల్యవివాహాల నివారణ, హెల్ప్‌లైన్ సేవలపై వివరించారు. చివరగా మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా, బాలికల విద్య, రక్షణకు మద్దతుగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం పి.రామచంద్రరావు, ఉపాధ్యాయులు, మిషన్ శక్తి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)