ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డిస్కస్ త్రో పోటీలకు రామవరం విద్యార్థి ఎంపిక

5 రోజుల క్రితం

డిస్కస్ త్రో పోటీలకు రామవరం విద్యార్థి ఎంపిక image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 05:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - అనపర్తి

మండలంలోని రామవరం గ్రామంలోని జడ్పీ హైస్కూల్ కు చెందిన పలివెల హరిచంద్ర మనోహర్ తొలి ప్రయత్నంలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి డిస్కస్ త్రో పోటీలలో ద్వితీయ స్థానంలో నిలిచి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.

గతంలో ఏ క్రీడల్లోనూ పాల్గొనని మనోహర్‌లోని క్రీడా ఆసక్తిని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు ఆర్. ప్రియాంక గుర్తించారు. అతడికి సకాలంలో తగిన శిక్షణ ఇచ్చి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు తీసుకెళ్లారు. రాజమహేంద్రవరంలో జరిగిన ఈ పోటీలలో అండర్-14 విభాగంలో మనోహర్ తన ప్రతిభను కనబరిచి జిల్లాలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాల కమిటీ చైర్మన్, ఉపాధ్యాయ బృందంతో కలిసి విద్యార్థి మనోహర్ ఎంఎల్ఎ నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థిని ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. పతకాన్ని సాధించిన మనోహర్‌ను, తర్ఫీదు ఇచ్చిన పీడీ ప్రియాంకను అనపర్తి ఎంపిడిఒ మండ రామకృష్ణారెడ్డి, ఎస్ఎంసి చైర్మన్ ఎస్.హరికృష్ణారెడ్డి, హెచ్ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు అభినందించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్