ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చట్టాలపై విద్యార్థులకు అవగాహన అవసరం...

5 రోజుల క్రితం

చట్టాలపై విద్యార్థులకు అవగాహన అవసరం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 05:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -పెద్దాపురం

‘సురక్షిత బాల్యం-బాలల సంరక్షణ ఉద్యమం’ పురస్కరించుకుని మంగళవారం పెద్దాపురంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, జవహర్‌లాల్ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్‌లో న్యాయ అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దాపురం 7వ అదనపు జిల్లా జడ్జి ఎన్.సరస్వతి మాట్లాడుతూ పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, మోటార్ వాహన చట్టం, ఉచిత న్యాయ సేవాధికార చట్టాలు, విద్యా హక్కు చట్టం తదితర అంశాలతో పాటు ‘గుడ్ టచ్-బ్యాడ్ టచ్’పై విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించారు. విద్యార్థులందరూ క్రమశిక్షణతో చదువుకుని బాధ్యతాయుతమైన పౌరులుగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమాలలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు తటవర్తి సత్యనారాయణ, హెచ్ఎం ఎస్.రవీంద్ర, న్యాయవాదులు ఎస్.దుర్గారావు, అత్తిలి ప్రభూజీ, ఎస్.విశాలాక్షి, మడికి రాంబాబు, కెఎంఎల్ గణేష్, పారా లీగల్ వాలంటీర్లు ఎన్.శ్రీహర్ష, ఎం.భాస్కరరావు, నూతలపాటి అప్పలకొండ, బి.సూర్యనారాయణ మూర్తి, కెవివి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

సదస్సులో మాట్లాడుతున్న జడ్జి సరస్వతి

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్