ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నికల విధుల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి ఆర్‌డిఒ ఎస్.మల్లిబాబు

5 రోజుల క్రితం

ఎన్నికల విధుల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ఆర్‌డిఒ ఎస్.మల్లిబాబు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 06:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కాకినాడ

కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల విధుల్లో నియమితులైన జోనల్, రూట్ ఆఫీసర్లు పూర్తి అప్రమత్తతతో బాధ్యతలు నిర్వర్తించాలని ఆర్‌డిఒ ఎస్.మల్లిబాబు సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో అదనపు ఎన్నికల అధికారి, కమిషనర్ ఎన్.వివి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన అవగాహన సమావేశంలో ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే పోలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేయడం, ఉన్నతాధికారులకు తక్షణ సమాచారం అందించడం వంటి అంశాలను వివరించారు. అలాగే, పోలింగ్ ప్రారంభానికి ముందు బ్యాలెట్ బాక్సుల తనిఖీ, సీలింగ్ ప్రక్రియ, పోలింగ్ ముగిసిన అనంతరం డిక్లరేషన్లు, సంబంధిత ఫారాల పూర్తి, ప్రిసైడింగ్ డైరీలో ముఖ్యమైన ఘటనల నమోదు తదితర విధివిధానాలపై స్పష్టతనిచ్చారు. సమావేశంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్