గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చెముడులంకలో ఘనంగా అంగన్‌వాడీల అభినందనోత్సవం

49 నిమిషాల క్రితం

aalamuru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 04:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు : ప్రధాని మోడీ జన్మదినోత్సవ మహోత్సవాలు, సేవా సంకల్ప్‌ అభియాన్‌లో భాగంగా కొత్తపేట మండలం చెముడులంక పొగాకు ఆఫీస్‌ అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం అంగన్‌వాడీల అభినందన ఉత్సవం నిర్వహించారు. ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ వరలక్ష్మీదేవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సొసైటీ చైర్మన్‌ నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్‌ నాగిరెడ్డి వెంకటరత్నం పాల్గొన్నారు. స్థానిక సెక్టార్ పరిధిలో చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహార ప్రాధాన్యం, పూర్వ ప్రాథమిక విద్యపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ వేడుకను ఏర్పాటు చేశారు.​ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలలో అంగన్‌వాడీ కేంద్రాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాఠశాల విద్యకు పునాది అంగన్‌వాడీ కేంద్రాల్లోనే పడుతుందని తెలిపారు.​ అలాగే వారంతా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం అంగన్వాడి టీచర్ కె.జ్యోతి, అంగన్వాడి హెల్పర్ ఏం.సత్యశ్రీ ల సేవలను స్థానిక ఏరియా మహిళలు గుర్తించగా వారిని ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కొత్తపల్లి రాంబాబు, శిరంగుల సతీష్, అడబాల వీర్రాజు, తమ్మన ఏసు, ఉంగరాల బాబులు, లంకలపల్లి ఆంజనేయులు, గౌరవం వెంకటేశ్వరరావు పామర్తి పేర్రాజు, అంగన్వాడిలు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, గర్భిణీలు, బాలింతలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్