మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్థానిక ఎన్నికల జనసేన కోఆర్డినేషన్ కమిటీ నియామకం

11 అక్టోబర్, 2026

aalamuru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026, 04:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

జేపి, కృష్ణంరాజు, పద్మలకు ప్రత్యేక స్థానం

ప్రజాశక్తి - ఆలమూరు : స్థానిక నియోజకవర్గం జనసేన పార్టీ స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీలో నియోజకవర్గానికి చెందిన ముగ్గురు నాయకులను నియమిస్తూ పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కోఆర్డినేషన్ కమిటీ సమన్వయకర్తలుగా ఆలమూరు మండలం నుంచి మూలస్థానం కి చెందిన సలాది జయప్రకాశ్ నారాయణ(జేపి), చెముడులంక కి చెందిన ప్రముఖ న్యాయవాది చోడిశెట్టి పద్మ, ఆత్రేయపురం మండల పార్టీ కన్వీనర్ చేకూరి కృష్ణంరాజు లను నియమించారు. వీరితోపాటు నియోజకవర్గంలోని 32 మందిని నిర్వాహక దళ సభ్యులుగాను, అలాగే మరో ఐదుగురిని సపోర్టింగ్ టీం సభ్యులుగా నియమిస్తూ జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ ఆదేశాల మేరకు కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి విజయానికి కృషి చేస్తామని సమన్వయకర్తలుగా నియమించిన సలాది జయప్రకాశ్ నారాయణ, చోడిశెట్టి పద్మ, తదితరులు ఆదివారం స్థానిక విలేకరులకు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్