బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆన్‌లైన్ ప్రక్రియపై ఎన్నికల అధికారులకు అవగాహన

14 నవంబర్, 2026

ఆన్‌లైన్ ప్రక్రియపై ఎన్నికల అధికారులకు అవగాహన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 06:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - రామచంద్రపురం: ​త్వరలో జరగనున్న గ్రామ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కె.గంగవరం మండలంలో ఎన్నికల అధికారులకు ఆన్లైన్ ప్రక్రియపై అవగాహనా సదస్సు ఏర్పాటు చేశారు. మండలంలో గల 26 గ్రామాల్లో స్థానిక పంచాయతీల ఎన్నికల ప్రక్రియలో భాగంగా స్టేజ్–1 రిటర్నింగ్ ఆఫీసర్లకు కేటాయించిన విధులను ఆన్‌లైన్‌లో సమర్థవంతంగా నిర్వహించే విధానంపై రాష్ట్రస్థాయిలో అవగాహనా కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేజ్–1 రిటర్నింగ్ ఆఫీసర్లకు వారి వ్యక్తిగత లాగిన్ ద్వారా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, అవసరమైన సమాచారాన్ని అప్‌లోడ్ చేయడం, సంబంధిత ప్రక్రియలను పూర్తి చేయడం వంటి అంశాలపై అవగాహన, ఎన్నికల విధుల్లో భాగంగా ప్రతి రిటర్నింగ్ ఆఫీసర్ తమ వ్యక్తిగత లాగిన్‌ను ఉపయోగించి సంబంధిత సమాచారాన్ని స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ప్రక్రియలో ఎటువంటి తప్పిదాలకు తావులేకుండా నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం వివరాలను నమోదు చేయాలని అధికారులు సూచించారు. రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమం ద్వారా స్టేజ్–1 రిటర్నింగ్ ఆఫీసర్లకు ఆన్‌లైన్ ప్రక్రియపై స్పష్టత ఏర్పడిందని, ఎన్నికల విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని శిక్షణ పొందిన అధికారులు తెలిపారు.కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ ఎన్.శ్రీనివాస్, కె. గంగవరం ఎస్ఐ జి.సోమెంద్ర, హెల్ప్‌డెస్క్ ట్రైనర్ జి.వి.సుబ్రహ్మణ్యం, స్టేజ్ వన్ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్