మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కలవచర్ల పంచాయతీని ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీడీవో రాజు

56 నిమిషాల క్రితం

MPDO Raju conducts a surprise inspection of Kalavacharla Panchayat.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 03:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండలంలోని కలవచర్ల పంచాయతీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి చెత్త సేకరణ రికార్డులు నిర్వహణపై ఎంపీడీవో ఏ రాజు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా ఎస్డబ్ల్యూపిసి నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు, అలాగే నిర్మాణంలో ఉన్న వెల్నెస్ సెంటర్ భవన నాణ్యత ప్రమాణాలపై ఆరా తీశారు. అనంతరం పంచాయతీ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య పనుల్లో భాగంగా సిబ్బందికి చెత్త నుండి సంపద తయారీపై ఇప్పటికే శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు. అలాగే తడి, పొడి చెత్తల సేకరించే విధానాన్ని మండలంలో గల ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అలాగే సేకరించిన చెత్త నుండి సంపద ఏ విధంగా తయారు చేయాలనే అంశంపై ప్రత్యేక శిక్షణ మండల పరిధి అన్ని గ్రామాల పంచాయతీల సిబ్బందికి ఇచ్చామన్నారు. దీని వలన గ్రామంలో పరిశుభ్రతతో పాటు పంచాయతీలకు ఆదాయం కూడా సమకూరుతుందని ఆయన వివరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్