ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : ఈ నెల 29న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మండల పరిధిలో 16 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలకు మండల పరిషత్ కార్యాలయంలో ఏఆర్ఓ, ఎంపీడీవో ఏ.రాజు పర్యవేక్షణలో ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ పేపర్లుతో సహ ఎన్నికల సామాగ్రిని గురువారం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 18 గ్రామాలు ఉండగా ఇప్పటికే పెనికేరు, సందిపూడి గ్రామాలు వార్డులతో సహా ఏకగ్రీవం అయినట్లు తెలిపారు. దీంతో మిగిలిన 16 గ్రామాలలో జరిగే ఎన్నికలకు ముందుగా ఈ నెల 28న బ్యాలెట్ బాక్సులు, సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు చేరుకునే సమయానికి సిబ్బందికి కావలసిన మౌలిక వసతుల కల్పనకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ జరిగేందుకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల అనుకూలత తదితర అంశాలపై క్షేత్రస్థాయి పరిశీలన చేసి నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా క్షుణ్ణంగా పరిశీలన చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్తు మెహర్ ప్రకాష్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ సతీష్, టైపిస్ట్ వలీ, సిబ్బంది పాల్గొన్నారు.
పంచాయతీ ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లు సిద్ధం : ఏఆర్ఓ, ఎంపీడీవో రాజు
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 26, 2026, 04:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)