క్షేత్ర ప్రదర్శన బోధన ప్రేమికుడు...
** జీవవైవిద్య పరిరక్షణలో ఓ ఉపాధ్యాయుడు.
*సైన్స్ పిక్స్ బోధనలో అందే వేసిన చేయి
ప్రజాశక్తి -మామిడికుదురు (కోనసీమ) : ఆయన వృత్తి జీవ శాస్త్ర బోధన.... ప్రవృత్తి మాత్రం క్షేత్రస్థాయి బోధనపై మమకారం... జీవ పరిరక్షణకు ఆరాటం... సైన్స్ ప్రాజెక్టులు, పర్యావరణ పరిరక్షణ, జన విజ్ఞాన వేదిక, ద్వారా ప్రజలలో, విద్యార్థులలో చైతన్య తీసుకురావడానికి పాటుపడుతున్నారాయన ఆయన పేరు సూరుమేను శ్రీనివాసరావు. జన్మస్థలం గూడపల్లి మలికిపురం మండలం, ప్రస్తుతం పాశర్లపూడి హై స్కూల్లో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా రిసోర్స్ పర్సన్ కోచ్ గా,జన విజ్ఞాన వేదిక క్రియా శీలక నాయకునిగా, సమాజ సేవకుడిగా సేవలందిస్తున్నట్లు ఆయన ప్రజాశక్తి తెలిపారు.
క్షేత్ర ప్రదర్శనతో విద్యాబోధన ....
విద్యార్థులకు తరగతి గదులలో బోధన కంటే క్షేత్రస్థాయి ప్రదర్శన ప్రత్యక్ష బోధనతో వారిలో నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు దోహదపడతాయన్నారు. విద్యార్థులను వ్యవసాయ క్షేత్రాలలోకి తీసుకువెళ్లి వరి నాట్లు,వరి యంత్రాలతో కోతలు, దాన్యం నూర్పిల్లు ఇలా అనేక అంశాలు బోధిస్తూ తనదైన శైలిలో బోధన ఇస్తున్నారు. అంతేకాకుండా కొబ్బరి పీచుతో తయారు చేసే కలాత్మక వస్తువులు, బొమ్మలు తయారీ విధానం ప్రత్యక్షంగా చూపిస్తూ వారి ఆలోచన విధానాన్ని మెరుగుపరుస్తున్నారు.
* యాప్ ల ద్వారా విద్యా బోధన..
డిజిటల్ యుగంలో విన్నూతనం గా టెక్నాలజీ ఉపయోగిస్తూ ఐ ఎఫ్ ఈ ద్వారా, ఎ ఐ ద్వారా, దీక్ష యాప్,లిప్ యాప్ ల ద్వారా సరికొత్త పద్ధతులులో బోధన చేస్తూ వారి అవగాహన మెరుగుపరుస్తున్నారు. విన్నుతన బోధనా పరికరణాలు( టి ఎల్ ఎమ్ ) ఉపయోగించి విద్యార్థులను ఆకట్టుకునేలా గత 15 ఏళ్ల నుంచి టెన్త్ విద్యార్థులుజీవ శాస్త్రం లో నూరు శాతం మార్కులు సాధించారన్నారు. కేశన కుర్రుపాలెం, తాటిపాక, రాజోలు బాయ్స్, పాశర్లపూడి హై స్కూల్ లలో జీవశాస్త్ర బోధనలో టెన్త్ విద్యార్థులు 100శాతం ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు.
*జీవవైవిద్య పరిరక్షణ ధ్యేయముగా సైన్స్ ప్రాజెక్టులు ....
సైన్స్ పెయిర్ కార్యక్రమములో మేక యొక్క అవయవాలు స్వయముగా సేకరించి విద్యార్థుల ముందు ప్రదర్శించి వారి ఆలోచన విధానాన్ని మెరుగుపరుస్తుండటం జరుగుతుందన్నారు. ఇటీవల స్మార్ట్ సిటీ, గ్రీన్ ఎనర్జీ, జీవవైవిద్య పరిరక్షణ ఈ మూడుసైన్స్ ప్రాజెక్టులు గ్రామ, మండల, జిల్లా స్థాయి లో ప్రదర్శనకు ఎంపికై జిల్లా విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగిందన్నారు. ఇటీవల జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవంలో పాశర్లపూడి హై స్కూల్లో 70 సైన్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్శించి మండల విద్యాశాఖ అధికారి మోకా వెంకన్నబాబు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసలు అందుకున్నారు. ఈ కార్యక్రమం పై వీడియో జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం పొంది డిఇఓ జ్ఞాపిక అందజేసి అభినందించారన్నారు.పర్యావరణ పరిరక్షణ, జీవవైవిద్య పరిరక్షణ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలలో అవగాహన కల్పించి పరిష్కార మార్గాలు తెలుసుకోవడం జరిగిందన్నారు .
*మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాయకత్వం ....
మండల యూటీఎఫ్ సీనియర్ కార్యకర్తగా ఉపాధ్యాయుల హక్కులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలల మనుగడ కోసం కృషి చేస్తున్నామన్నారు. జన విజ్ఞాన వేదిక మండల ప్రధాన కార్యదర్శిగా క్రియా శీలకంగా ఉండి మూఢనమ్మకాల నిరోధం, శాస్త్రీయ దృక్పథం, కలిగించే విధంగా సైన్సు ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ప్రజలలో చైతన్యం కలిగిస్తున్నామన్నారు. చెకుముకి పరీక్ష నిర్వహణలో కీలకపాత్ర పోశిస్తున్నామన్నారు.
*రీసోర్స్ పర్సన్ కోచ్ ....
మండల, జిల్లా రీసోర్స్ పరసన్ గా వ్యవహరిస్తూ ఉపాధ్యాయులకు వివిధ రకాల శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ఎమ్ డి పి. రిసోర్స్ పర్సన్ గా, టి పి డిసైన్స్ కోర్స్ పరసన్గా వ్యవహరించామన్నారు. కెరీర్ గైడెన్స్ రీసోర్స్ పర్చనగా జిల్లా విద్యాశాఖలో జరిగే వివిధ కార్యక్రమాల్లో సెయింట్ పేరు న్యాయ నిర్ణేతగా వ్యవహరించామన్నారు.
*సేవా కార్యక్రమాలు ....
తల్లి సూరు మేను గంగామణి జ్ఞాపకార్థం మూడేళ్ల నుంచి చిన్నచిన్న సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్, వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేయడం, విద్యార్థులకు ఎన్ జి సి యూనిఫామ్ గ్రీన్ షర్ట్ ఉచితంగా ఇచ్చి స్కూల్లో ఉచితంగా మొక్కలు నాటడం కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.








కామెంట్‌లు (0)