ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : నవజాత శిశువు ఆరోగ్యవంతమైన సుస్థిర జీవితానికి తల్లి పాలు ఔషధంగా పని చేస్తాయని ఐసిడిఎస్ సూపర్ వైజర్ వరలక్ష్మి అన్నారు. కొత్తపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ ఏ.గజలక్ష్మి ఆదేశాలను మండలంలోని చెముడులంక అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం సోమవారం తల్లిదండ్రులతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లి పాలు శిశువుకు ఔషధం వలే పనిచేస్తాయని గర్భిణీ, బాలింతలు, పాలిచ్చు తల్లులకు తెలిపారు. గర్భిణీలు ఆరోగ్య వంతమైన శిశు వుకు జన్మనివ్వాలనే సదుద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలు మరింత కీలకంగా ఉండేందు కార్యాచరణ రూపొందించారన్నారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆదేశానుసారం తల్లి పాల వారోత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏంఎల్హెచ్పి మాధురి, ఏఎన్ఎం శాంతకుమారి, మహిళ పోలీస్ సాధన, అంగన్వాడీలు యు.సుశీల, సూర్యకుమారి, సత్యవతి, గర్భిణీలు, బాలింతలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
ఆరోగ్యవంతంమైన జీవితానికి తల్లిపాలు ఔషధం
03 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 03, 2026, 04:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)