ప్రజాశక్తి - ఆలమూరు :
మండల కేంద్రంలోని శ్రీ సిద్ధార్థ పాఠశాలలో పాఠశాల డైరెక్టర్ కె.ముల్లారావు ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ముల్లారావు మాట్లాడుతూ... విద్యార్థిని విద్యార్థులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా పలువురు చిన్నారులు... యశోద, కృష్ణుడు, గోపికలు వేషధారణలతో నృత్యాలు చేసి అలరించారు. అలాగే పాఠశాల ఆవరణలో ఉట్టి కొట్టే కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విష్ణు, జెసినా జోసెఫ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)