బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మోడరన్‌లో చుక్కా రామయ్య 100వ పుట్టినరోజు

4 రోజుల క్రితం

మోడరన్‌లో చుక్కా రామయ్య 100వ పుట్టినరోజు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 05:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - రామచంద్రపురం : ​మోడరన్ విద్యాసంస్థల్లో ఘనంగా డాక్టర్ చుక్కా రామయ్య 100వ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ఐఐటి లెజెండ్, మాజీ ఎంఎల్‌సి డాక్టర్ చుక్కారామయ్య పుట్టినరోజు కార్యక్రమాన్ని మోడరన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లయిన్ జి.వి.రావు ఆధ్వర్యంలో విద్యాసంస్థల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జి.వి. రావు మాట్లాడుతూ డాక్టర్ చుక్కారామయ్య స్పేస్ ప్రోగ్రాంలో తమ విద్యా సంస్థలు భాగస్వామ్యలుగా ఉండటం ఆనందంగా ఉందన్నారు. స్పేస్ ప్రోగ్రాo తమ విద్యాసంస్థల్లో విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో మోడరన్ విద్యాసంస్థల విజయోత్సవాలకు పలుమార్లు డాక్టర్ చుక్కా రామయ్య ముఖ్య అతిథిగా హాజరైన అంశాన్ని ఈ సందర్భంగా రావు ప్రస్తావించారు. తమ మోడరన్ ఫౌండేషన్ ద్వారా డాక్టర్ చుక్కా రామయ్యకు గణిత మహర్షి పురస్కారం అందజేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామన్నారు. రామయ్యతో తనకు గల వ్యక్తిగత అనుబంధాన్ని రావు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులకు రూ.కోటి స్కాలర్షిప్ అందజేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఈ ప్రణాళికలో భాగంగా ప్రస్తుత టెన్త్ క్లాస్ విద్యార్థులకు డిసెంబర్ 20 ఆదివారం స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపారు. స్కాలర్షిప్ టెస్టులో ఎంపికైన విద్యార్థులకు డాక్టర్ చుక్కా రామయ్య శతవర్ష స్కాలర్షిప్ అందజేస్తామన్నారు. మోడరన్ విద్యాసంస్థల విజయ ప్రస్థానంలో చుక్కారామయ్య సూచనలు అమూల్యమైనవని ఈ సందర్బంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ పి. వెంకటేశ్వర్లు, హైస్కూల్ హెడ్మాస్టర్ ఎం.చిట్టిబాబు, ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ సిహెచ్.రాజేష్, వైస్ ప్రిన్సిపల్ పిఎస్.ప్రకాష్, అకాడమిక్ అడ్వైజర్ సిహెచ్ శ్రీనివాస్, స్టాప్ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్