శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

శిశువుకు తల్లిపాలతో పూర్తి పోషణ

05 ఆగస్టు, 2026

Complete nutrition for the baby through breast milk.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 03:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : పుట్టిన ప్రతి శిశువుకు తల్లిపాలు ఇవ్వడం వలన పూర్తి పోషణ కలిగి మెదడు ఎదుగుదల జరుగుతుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ కె.వరలక్ష్మి దేవి తెలిపారు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని కొత్తపేట సిడిపిఓ ఏ.గజలక్ష్మి ఆదేశాల మేరకు మండలంలోని మూలస్థానం అగ్రహారం అంగన్వాడి సెంటర్లో తల్లిపాల వారోత్సవాలు బుధవారం ఆమె ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిపాల వలన శిశువుకు రోగ నిరోధక శక్తి, జీర్ణ ప్రక్రియ మెరుగుదల అవుతుందన్నారు. మొదటి ఆరు నెలలు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని తర్వాత తల్లిపాలు కొనసాగిస్తూ అనుబంధ ఆహారంతోపాటు పాలను రెండు ఏళ్ల పాటు కొనసాగించాలని తెలిపారు. తల్లిపాలు ఇవ్వడం వలన తల్లికి గర్భాశయ సంకోచన, బరువు నియంత్రణ, క్యాన్సర్ బారి నుండి రక్షించబడతారని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ ఏం.నాగమణి, ఏఎన్ఎం షేక్ షకీలా, ఆశాలు రాణి, రత్నకుమారి, భాగ్యవతి, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్