ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఏ.రాజు ఆధ్వర్యంలో గురువారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజుకు గుర్తుగా ఏటా ఈ రోజును నిర్వహిస్తారు. ఇది 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చిందన్నారు. దీనిని 'సంవిధాన్ దివస్' అని, అలాగే 'జాతీయ న్యాయ దినోత్సవం' అని కూడా పిలుస్తారన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలోని ముసాయిదా కమిటీ, రాజ్యాంగ సభ సభ్యుల కృషికి గౌరవంగా, 2015లో భారత ప్రభుత్వం నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్తు ఏవో మెహర్ ప్రకాష్, ఎంఈఓలు అప్పాజీ, రాజు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ సతీష్, టైపిస్ట్ వలీ, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా రాజ్యాంగ దినోత్సవం ..
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 26, 2026, 04:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)