ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మూలస్థానం, తోకలంక మార్గంలో కల్వర్టు నిర్మాణం వేగవంతం

3 రోజుల క్రితం

Culvert construction on the Moolasthanam-Tokalanka route accelerated.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 03:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రూ 50 లక్షలు నిధులు మంజూరు


ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండలంలోని మూలస్థానం, తోకలంక మార్గంలో గోదావరి నది పాయ పై కల్వర్టు నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయని మండల టిడిపి అధ్యక్షుడు ఈదల సత్తిబాబు, పంచాయతీరాజ్ ఏఈ డి.వీరభద్రరావు తెలిపారు. దీనికి విబిజిఆర్ఏఏంజి(ఉపాధి) నిధుల నుంచి రూ. 50 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం వారు కూటమి నాయకులతో కలిసి కల్వర్టు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సత్తిబాబు మాట్లాడుతూ గోదావరి వరదల సమయంలో మూలస్థానం నుంచి తోకలంక వెళ్లేందుకు ప్రధాన రహదారి మధ్యలో నది పాయ వద్ద ప్రతి ఏట వరదలకు కొట్టుకుపోతుందన్నారు. దీంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై రైతులు, గ్రామస్తులు గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో బండారు సత్యానందరావు దృష్టికి ఈ సమస్యను తీసుకురావడంతో ఆయన స్పందించి గత ఏడాది నిధులు మంజూరు చేసి తూరలు వేసి తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేశారు. అయితే అనంతరం గోదావరికి వచ్చిన వరదలలో తూరలు మార్గం నదీ ప్రవాహానికి కొట్టుకుపోయిందన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బండారు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ప్రత్యేక సలహాతో పటిష్టంగా కల్వర్టు నిర్మాణం చేపట్టాలనే లక్ష్యంతో ఉపాధి పథకం ద్వారా రూ.50 లక్షలు నిధులు మంజూరు చేశారన్నారు. దీంతో తూరలను కాంక్రీట్ తో నిర్మించి, ఐరన్ గ్రిల్ తో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టే విధంగా పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు సలాది నాగేశ్వరరావు, వంటిపల్లి సతీష్ కుమార్, ఈదల నల్లబాబు, నాగిరెడ్డి వెంకటరత్నం, గానుగుల చిన్న, దొంగ భాస్కరరావు, తోరాటి సత్తిబాబు, బోడపాటి మారుతి, ఆకుల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్