శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అందరి సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం : ఎంపీపీ లక్ష్మణరావు, ఎంపీడీవో రాజు, మండల ప్రత్యేక అధికారి లక్ష్మీ ప్రత్యూష

1 గంట క్రితం

అందరి సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం : ఎంపీపీ లక్ష్మణరావు, ఎంపీడీవో రాజు, మండల ప్రత్యేక అధికారి లక్ష్మీ ప్రత్యూష
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 05:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధుల సమన్వయంతోనే మండలాభివృద్ధి సాధ్యపడుతుందని ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, మండల ప్రత్యేక అధికారి డి.లక్ష్మీ ప్రత్యూష, ఎంపీడీవో ఏ.రాజు అన్నారు. మండల పరిషత్‌ సమావేశ మందిరంలో శనివారం ఎంపీడీవో రాజు ఆధ్వర్యంలో ఎంపీపీ లక్ష్మణరావు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు ప్రజా ప్రతినిధుల మధ్య వాడి వేడిగా చర్చలు జరిగాయి. ముందుగా ఆయా శాఖల అధికారులు తమ పరిధిలో జరిగిన అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అందిస్తున్న సేవలను క్షుణ్ణంగా వివరించారు. వీటిపై ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలను లేవనెత్తి అధికారులను నిలదీశారు. చివరగా వారు మాట్లాడుతూ, అధికారులు అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి పట్ల తాము కూడా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరు కాకపోవడాన్ని వారు తప్పు బట్టారు. ఈ కార్యక్రమంలో డిసి అధ్యక్షుడు మెర్ల గోపాలస్వామి, మండల పరిషత్ ఏవో మెహర్ ప్రకాష్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్