మామిడికుదురు: నేటి డిజిటల్ యుగంలో పిల్లలు సెల్ఫోన్లు, టివిలకు బానిసలు కాకుండా ఏకాగ్రతతో చదువుపై శ్రద్ధ చూపాలని ఎంఇఒలు శ్రీనివాస్, వెంకన్న బాబులు పేర్కొన్నారు.. మామిడికుదురు గ్రంథాలయములో 59వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం గ్రంథాలయాధికారి సూర్యనారాయణ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. వారోత్సవాల్లో భాగముగా వివిధ విభాగాల్లో విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు మండల విద్యాశాఖాధికారులు బహుమతులు అందజేశారు. సృజనాత్మకత, నైతిక విలువలను పెంపొందించేందుకు పుస్తక పఠన ఏకైక మార్గమని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సి హెష్ కేశవరావు, టీచర్ నాగరాజు, ఎరుబండి కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)