బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తైక్వాండో పోటీల్లో ఎడ్యుకేర్ విద్యార్థినికి స్వర్ణ పతకం

16 నవంబర్, 2026

తైక్వాండో పోటీల్లో ఎడ్యుకేర్ విద్యార్థినికి స్వర్ణ పతకం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 05:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-మామిడికుదురు : పిఠాపురంలో అండర్-19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తైక్వాండో పోటీల్లో ఎడ్యుకేర్ కళాశాల విద్యార్థిని ఎరుబండి గంగాభవాని స్వర్ణ పతకం సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ సోమవారం తెలిపారు. ఈ నెల 10, 11 తేదీలలో జరిగిన ఈ పోటీల్లో ఇంటర్ చదువుతున్న గంగాభవాని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుందని, రాజోలుకు చెందిన కోచ్ ఆర్.మణికుమార్ వద్ద ఆమె శిక్షణ పొందినట్లు తెలిపారు. జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై కళాశాలకు పేరు తెచ్చిన గంగాభవానిని కళాశాల కరస్పాండెంట్ కె.మురార్జీ, డైరెక్టర్ కె.సత్యవాణి, ప్రిన్సిపల్, అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్