శనివారం, 08 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

లంక పొగాకు వ్యాపారంతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం : కొత్తపేట ఎమ్మెల్యే బండారు

1 గంట క్రితం

Our family has a deep association with the Lanka tobacco trade: Kothapeta MLA Bandaru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 03:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : లంక పొగాకు వ్యాపారంతో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని తన తాతయ్య, తండ్రి ఈ వ్యాపారం ద్వారానే గుర్తింపు పొందారని, వారి కష్టం తెలుసునని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. లంక పొగాకు వ్యాపారం ఎక్కువ జరిగే మండలంలోని చెముడులంక విచ్చేసిన ఆయన పలువురు పొగాకు వ్యాపారులతో కూర్చుని ముచ్చటించి సాధక, బాధకాలు సానుకూలంగా విన్నారు. అలాగే ప్రస్తుత వ్యాపారం తీరుతెన్నులను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ తన బాల్యం నుంచి ఈ పొగాకు వ్యాపారంపై అనుభవం ఉందన్నారు. అలాగే ఈ లంక గ్రామాల రైతులు, వ్యాపారులతో కూడా తన తండ్రుల కాలం నుంచి ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తు చేసారు. పొగాకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఆయన వెంట మండల టిడిపి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈదల సత్తిబాబు, సలాది నాగేశ్వరరావు, డిసి చైర్మన్ మెర్ల గోపాలస్వామి, చొప్పెల్ల సొసైటీ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, ఎంపిటీసి తమ్మన భాస్కరరావు, మాజీ సర్పంచ్ నాగిరెడ్డి వెంకటరత్నం, కూటమి నేతలు కొత్తపల్లి రాంబాబు, నాగిరెడ్డి సత్యానందం, సిరంగుల సతీష్, అడబాల వీర్రాజు, గుండుమళ్ల రామారావు, లంకలపల్లి ఆంజనేయులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్