శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సీఎంఆర్ఎఫ్ తో బాధితులకు ఆర్థిక చేయూత : ఎమ్మెల్యే బండారు

1 గంట క్రితం

సీఎంఆర్ఎఫ్ తో బాధితులకు ఆర్థిక చేయూత : ఎమ్మెల్యే బండారు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 05:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : సీఎం రిలీఫ్ ఫండ్ తో పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన రోగులైన బాధిత కుటుంబాలకు ఆర్థికంగా చేయూత లభిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. మండల కేంద్రంలో సొసైటీ వద్ద ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అర్హులకు మంజూరు కాగా శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు అండగా నిలుస్తున్నారని, పేద, మధ్యతరగతి వర్గాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉపశమనం కలుగుతుందన్నారు. వైసీపీ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పేదలకు అందని ద్రాక్షగా ఉండేదన్నారు. తమకు కావలసినవారికి మాత్రమే రిలీఫ్ ఫండ్ అందజేసేవారని, కూటమి ప్రభుత్వంలో పేదలందరికీ మేలు జరుగుతుందన్నారు. అటు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, ఇటు ఇన్సూరెన్స్ కవర్ కాని రోగులకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందన్నారు. ఇందులో భాగంగా మండలానికి చెందిన 76మందికి రూ. 33,37,777ల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్