ప్రజాశక్తి - మామిడికుదురు (కోనసీమ) : నగరం గ్రామం తాడివారి గ్రూపు (గెద్దాడ హైవే దగ్గర) ఒఎన్ జీసీ గ్యాస్ బావి నుండి గ్యాస్ లీకేజీ ఏర్పడిన నేపథ్యంలో రాజోలు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి, మాజీ శాసన సభ్యురాలు పాముల రాజేశ్వరి దేవి వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులు, ఆర్డీవో తో కలిసి ఘటనా స్థలిని పరిశీలించి, వివరాలు సేకరించారు. లీకేజీని త్వరితగతిన సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు తగిన తక్షణ రక్షణ చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. పునరావాస కేంద్రాలలో బాధితులకు, ఆహారము త్రాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. ఆమె వెంట వైసీపీ రాష్ట్ర కార్యదర్శిపాముల దేవీ ప్రకాష్ తదితరులు ఉన్నారు.
గ్యాస్ లీకేజీ ఘటన పై మాజీ ఎమ్మెల్యే స్పందన
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 17, 2026, 12:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)