ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అదుపులోకి వచ్చిన గ్యాస్ లీకేజీ నియంత్రణ

5 రోజుల క్రితం

Gas leak brought under control
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 04:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

గ్యాస్ బ్లో అవుట్ ఘటనల భద్రతా చర్యలపై సెప్టి ఆడిట్ : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం


ప్రజాశక్తి - మామిడికుదురు (కోనసీమ) : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మామిడికుదురు మండలం నగరం గ్యాస్ లీకేజీ ఘటనలో కీలక పరిణామంచోటుచేసుకుంది. గ్యాస్ లీకేజీ వెల్ వద్ద ప్రెజర్ తగ్గడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం గ్యాస్ ఎగ చిమ్మడం ఆగినట్లు సమాచారం. ప్రెజర్ తగ్గడంతో ప్రజలు ఊరట చెందారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. గ్యాస్ లీకేజీ ప్రాంతంలో కొనసాగుతున్న పరిస్థితుల పర్యవేక్షణను ఒఎన్జీసీ సిబ్బంది ఆధ్వర్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు నిపుణులు పరిశీలిస్తున్నారు. పూర్తిస్థాయిలో లీకేజీ నియంత్రణపై కొనసాగుతున్న చర్యలు..

ప్రజలు ఆందోళన చెందవద్దని.. అధికారుల సూచనలు పాటించాలని విన్నవిస్తున్నారు.


డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామ పరిధిలోని తాడివారిమెరక సమీపంలో ఓఎన్ జి సి గ్యాస్ రీడ్రిల్లింగ్ బావి వద్ద చోటుచేసుకున్న బ్లో అవుట్ ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. గ్యాస్ లీకేజీ త్రీవత పరిసర గ్రామాల ప్రజల భద్రత తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 4..30 గంటల సమయంలో పెద్ద శబ్దం తో ఒక్కసారిగా గ్యాస్ వెలువడినట్లు కలెక్టర్ తెలిపారు. గ్యాస్ లీకేజీ ప్రాంతానికి కిలోమీటర్ పరిధిలో ఉన్న కుటుంబాలను నగరం హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించినట్లు వివరించారు. 216వ జాతీయ రహదారి బైపాస్ రోడ్డు ను ఆనుకుని సంఘటన జరగడంతో రాకపోకలు నిలిపివేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఓ.ఎన్.జిసి సాంకేతిక బృందం బావి వద్దకు చేరుకుని గ్యాస్ లీకేజీ నియంత్రణ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిపారు. సుమారు 10 గంటలు శ్రమించి మధ్యాహ్నం మూడు గంటల సమయానికి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారని వివరించారు. ఇటీవల తరచూ వివిధ ప్రాంతాలలో గ్యాస్ లీకేజీ సంఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యములో ఓఎన్జిసి చైర్మన్ ఉన్నతాధికారులతో మాట్లాడి భద్రతా చర్యల పై సెప్టి ఆడిట్ నిర్వహించాలని దిశా నిర్దేశం చేశారు. గ్యాస్ లీకేజీ ప్రాంతాల ప్రజలకు ఎలాంటి అ సౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్