సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చెముడులంకలో ఘనంగా అంగన్‌వాడీల అభినందోత్సవం

35 నిమిషాల క్రితం

Grand Felicitation Ceremony for Anganwadi Workers in Chemudulanka
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 04:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : ప్రధాని మోదీ జన్మదినోత్సవ మహోత్సవాలు, సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా కొత్తపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ ఏ.గజలక్ష్మి సూచనలు మేరకు మండలంలోని చెముడులంక పంచాయతీలో ఐసిడిఎస్ సూపర్‌వైజర్ వరలక్ష్మి దేవి ఆధ్వర్యంలో అంగన్‌వాడీల అభినందన ఉత్సవాన్ని సొసైటీ చైర్మన్ నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ నాగిరెడ్డి వెంకటరత్నం సమక్షంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సెక్టార్ పరిధిలో చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహార ప్రాధాన్యం, పూర్వ ప్రాథమిక విద్యపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ వేడుకను ఏర్పాటు చేశారు.​ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలలో అంగన్‌వాడీ కేంద్రాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాఠశాల విద్యకు పునాది అంగన్‌వాడీ కేంద్రాల్లోనే పడుతుందని తెలిపారు.​ అలాగే వారంతా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం అంగన్వాడి కార్యకర్తలు గుర్రపు సత్యవతి, రాయపాటి ధనలక్ష్మి ల సేవలను గుర్తించి స్థానిక ఏరియా మహిళలు వారిని ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కొత్తపల్లి రాంబాబు, శిరంగుల సతీష్, అడబాల వీర్రాజు, తమ్మన ఏసు, ఉంగరాల బాబులు, పాలూరి వెంకటరమణ, అంగన్వాడి కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, గర్భిణీలు, బాలింతలు, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్