సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

2029 లోగా ప్రతి గడపకు తాగునీటి కనెక్షన్ : ఐటి, విద్యాశాఖ మంత్రి లోకేష్

1 గంట క్రితం

Drinking water connection to every household by 2029: IT and Education Minister Lokesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 04:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ (గుంటూరు) : 2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకు తాగునీటి కనెక్షన్, భూగర్భ డ్రైనేజీ, అండర్‌గ్రౌండ్ గ్యాస్ కనెక్షన్ పూర్తి చేస్తామని రాష్ట్ర విద్య, ఐటి,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ తెలిపారు. ఎంటిఎంసీ పరిధిలోని కుంచనపల్లిలోని శ్రీ శ్రీనివాస కన్వెన్షన్స్‌లో సోమవారం నిర్వహించిన ‘మన ఇల్లు–మన లోకేష్’ కార్యక్రమంలో మూడో విడతగా 372 మందికి శాశ్వత పట్టాలు, పీఎంఏవై మంజూరు పత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ... వచ్చే ఏడాది తొలి మూడు నెలల్లో మంగళగిరి 100 పడకల ఆసుపత్రి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. మహానాడు కట్ట రిటైనింగ్ వాల్, భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. మొదటి విడతలో 3,002, రెండో విడతలో 2,670, మూడో విడతలో 388 పట్టాలతో కలిపి సుమారు రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులకు ప్రజలకు శాశ్వత హక్కులు కల్పించామని లోకేష్ పేర్కొన్నారు. నిడమర్రు పాఠశాలను ఆదర్శంగా అభివృద్ధి చేయడంతో ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం పోటీ మంగళగిరి నుంచే ప్రారంభమైందన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నానని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయ్, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య, పోతినేని శ్రీనివాసరావు, ముమ్మిడి సత్యనారాయణ, పడవల మహేష్, పల్లబోతుల శ్రీనివాసరావు, వల్లభనేని వెంకట్రావు, దాసరి కృష్ణ, టిడిపి మంగళగిరి నియోజకవర్గం నాయకులు కొమ్మారెడ్డి కిరణ్, టిడిపి తాడేపల్లి మండల మాజీ అధ్యక్షులు అమరా సుబ్బారావు, టిడిపి గుంటూరు జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్, టిడిపి గ్రామ అధ్యక్షులు కానుగోలు కోటేశ్వరరావు రూరల్ గ్రామాల పార్టీ గ్రామ అధ్యక్షులు కార్యదర్శులు, ఇళ్ల పట్టాల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్