సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిత్యం చిరుధాన్యాల ఆహారము తీసుకోవాలి

52 నిమిషాల క్రితం

One should consume millets daily.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 05:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - మామిడికుదురు (కోనసీమ) : ఆకుకూరలు,కూరగాయలతో పాటు చిరు దాన్యాలను నిత్యం ఆహారములో భాగం చేసుకోవాలని సిడిపి ఒ విజయశ్రీ సూచించారు. మామిడి కుదురు పెర్ల కాలువ అంగన్ వాడీ కేంద్రంలో అంగన్వాడీ కేంద్రంలో సోమ వారం నిర్వహించిన పోషణ మాసోత్సవాలలో భాగముగా మన అంగన్ వాడీ..మన బాధ్యత కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం లో ఆమె మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలకు అవసరమైన పౌష్టికాహారంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు. ప్రతిరోజూ గుడ్లు, పాలు, పండ్లు, ఆకుకూరలు, ఇతర కూరగాయలు, చిరుధాన్యాలు, వేడి ఆహారం తీసుకోవడం ద్వారా రక్తహీనత వంటి సమస్యలను నివారించవచ్చని వివరించారు.అంగన్వాడీ కేంద్రాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. అనంతరం పోషణ మాసోత్సవాల సందర్భంగా ఏఎన్ఎంలు, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ సిబ్బంది పోషకాహారంపై అవగాహన పెంపొందించేందుకు ప్రతిజ్ఞ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్