సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పెంపుడు కుక్కలకు వ్యాక్సినేషన్ చర్యలు

50 నిమిషాల క్రితం

Vaccination measures for pet dogs
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 05:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • వెటర్నరీ వైద్యాధికారి డాక్టర్ డి.వినోద్ కుమార్


ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వివిధ వ్యాధులు సోకే అవకాశం ఉన్నందున పెంపుడు కుక్కలకు వ్యాక్సినేషన్ వేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెటర్నరీ వైద్యాధికారి డాక్టర్ డి వినోద్ కుమార్ అన్నారు. మండలంలోని జొన్నాడ పశు వైద్య కేంద్రంలో పెంపుడు కుక్కలకు ఆయన ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. యజమానులు తన పెంపుడు జంతువులను అప్రమత్తంగా చూసుకోవాలని ఆయన అన్నారు. లేనిపక్షంలో వీథి కుక్కలను కలవడం వలన వివిధ వ్యాధులు సోకుతాయన్నారు. అందుకే ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వం ఆధ్వర్యంలో వీథి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిర్వహించేలా అమలాపురంలో తొందరలోనే ఆపరేషన్ థియేటర్ అందుబాటులోకి రానుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ సిబ్బంది, యజమానులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్