ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండల కేంద్రంలోని ఎర్రకాలనీ శివారునా ఏటి గట్టు సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఒక గడ్డివాము దగ్ధమైంది. మండపేట అగ్నిమాపక శాఖ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, ఆలమూరుకు చెందిన సూరపురెడ్డి పెద్ద సత్యనారాయణ ఎర్ర కాలనీ శివారులో సుమారు 5 ఎకరాల గడ్డివాము ఏర్పాటు చేసుకున్నారు. దీనికి గుర్తు తెలియని వ్యక్తులు ధూమపానం చేయగా మిగిలిన పీకలను అగ్గి ఆర్పకుండా నిర్లక్ష్యంగా పడేయడం వల్ల మంటలు వ్యాపించినట్లు ప్రాథమికంగా అంచనాగా తెలిపారు. సుమారు రాత్రి 2:30 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేయగలిగామన్నారు. అలాగే స్థానిక పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం కారణంగా బాధితునికి గడ్డివాము విలువ సుమారు రూ.30 వేలు ఉంటుందని, ఈ మేరకు ఆస్తి నష్టం సంభవించినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు పొగ త్రాగిన తర్వాత సిగరెట్ పీకలను నిర్లక్ష్యంగా పడేయకుండా జాగ్రత్తలు పాటించాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచించారు.
ఎర్రకాలనీ సమీపంలో గడ్డివాము దగ్ధం - రూ.30 వేలు ఆస్తి నష్టం
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 22, 2026, 03:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)