ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మాచవరం మేజర్ పంచాయతీకి రసవత్తర పోరు

5 రోజుల క్రితం

Intense contest for Machavaram Major Panchayat
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 04:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

జనరల్ కావడంతో పెరిగిన ఆసక్తి..

బరిలో యువకుడు, విద్యావంతుడు సత్యమోహన్


ప్రజాశక్తి-అంబాజీపేట (కోనసీమ) : మాచవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ పీఠం కోసం పోటీ రసవత్తరంగా మారింది. పంచాయతీ జనరల్ కు కేటాయించడంతో ఈ సారి పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.మాచవరం గ్రామానికి చెందిన విద్యావంతుడు, యువకుడు దొమ్మేటి సత్యమోహన్ సర్పంచ్ పీఠం కోసం బరిలో దిగుతున్నారు. ఆయనకు 10 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. అంబాజీపేట సొసైటీ మాజీ చైర్మన్ గా రెండు సంవత్సరాలు పనిచేసి రైతు సేవలో అనుభవం గడించారు.


టెక్నాలజీతో గ్రామాభివృద్ధే లక్ష్యం..

2006-2008 సంవత్సరంలో హైదరాబాద్ లో యానిమేషన్ & ఆర్కిటెక్చర్ రంగంలో స్థిరపడిన సత్యమోహన్, అన్ని రంగాలలో పనిచేసిన అనుభవంతో స్వగ్రామమైన మాచవరం అభివృద్ధి కోసం తిరిగి వచ్చారు. అమలాపురంలో బిడిపిఎస్ (BDPS) కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి సాఫ్ట్ వేర్ రంగంలో ఎంతో మంది యువతకు అవకాశాలు కల్పించారు.

సర్పంచ్ గా అవకాశం ఇస్తే టెక్నాలజీతో నిరుద్యోగులకు ఉచిత స్కిల్ డెవలప్ మెంట్ ను అంబాజీపేటలో ఏర్పాటు చేసి యువతకు, నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తా. గ్రామాభివృద్ధికి సేవ చేయడమే నా లక్ష్యం" అని సత్యమోహన్ అన్నారు.


ప్రధాన హామీలు..

మాచవరంలో ఉన్న డంపింగ్ యార్డ్ ను అధునాతనంగా కేంద్ర, రాష్ట్రాలు ఆకర్షించేలా అభివృద్ధి చేస్తానని, గ్రామంలో న్యాయవ్యవస్థ, వైద్యంపై దృష్టి పెట్టి హెల్ప్ లైన్ డెస్క్ ఏర్పాటు చేస్తానని తెలిపారు. కులమతాలకతీతంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు న్యాయం, వైద్యం అందేలా చూస్తానని చెప్పారు. అంబాజీపేటలో కొబ్బరి, కొబ్బరి ఆధారిత పరిశ్రమలపై కృషి చేసి ప్రజలకు ఉపాధి కల్పించేలా దృష్టి పెడతానని, గ్రామంలో అఖిలపక్ష నాయకులతో సలహా మండలి ఏర్పాటు చేసి అందరికీ అభివృద్ధి జరిగేలా చూస్తానని అన్నారు. డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా క్రమబద్ధీకరించి మాచవరం ఖ్యాతిని పెంచుతానని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్