శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యాత్రికులతో కిటకిటలాడిన జనార్ధన స్వామి ఆలయం

31 అక్టోబర్, 2026

aalamuru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026, 05:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు : నారద మహర్షి ప్రతిష్ఠిత నవ జనార్ధన ఆలయాల్లో నాలుగవ క్షేత్రమైన ఆలమూరు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామి ఆలయం శనివారం యాత్రికులతో కిటకిటలాడింది. దూర ప్రాంతాల నుంచి యాత్రికులు అధిక సంఖ్యలో రావడంతో దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామి వారి దర్శనానికి క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో నరేంద్ర కుమార్, ఆలయ చైర్మన్ బైరిశెట్టి రాంబాబు, సభ్యులు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. సేవా సిబ్బంది భక్తుల క్యూ లైన్ లను సమర్ధంగా నిర్వహించడం, ఉదయం ప్రసాద వితరణ, మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ మొదలైన కార్యక్రమాల్లో తమ సేవలను అందజేశారు. ఆలయ ప్రాంగణంలో యాత్రికులు ప్రదక్షిణలు చేస్తూ జయ జనార్దన గోవిందా... వరాహ రూపాయ గోవిందా... ఆపద్బాంధవ జనార్దనా అన్న నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగిపోయాయి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్