బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ముగిసిన గ్రంధాలయ వారోత్సవాలు

4 రోజుల క్రితం

ముగిసిన గ్రంధాలయ వారోత్సవాలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 05:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - యంత్రాంగం : జిల్లాలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్బంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. పలువురు ప్రముఖులు హాజరై గ్రంథాలయాల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. ముమ్మిడివరం: విద్యార్థులు పుస్తక పఠనం పై ఆసక్తిని పెంచుకొని, జ్ఞానాన్ని వృద్ధి చేసుకొవాలని రిటైర్డ్ ఆంగ్ల ఉపాధ్యాయుడు జెవిఎల్ నరసింహారావు సూచించారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో స్థానిక ద్వితీయ శ్రేణి జిల్లా శాఖ గ్రంథాలయం నందు శుక్రవారం గ్రంSeలయ నిర్వాహకురాలు కె తులసి లక్ష్మీ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతు ప్రతి విద్యార్థి రోజులో కొంత సమయం పుస్తక పఠనానికి కేటాయించడం ద్వారా భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవచ్చునన్నారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థిని, విద్యార్దులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీళ్ల వీరాస్వామినాయుడు, జాగు రాంబాబు, శీలం వెంకట రమణ, పాము నాగేశ్వరరావు, నిమ్మకాయల విశ్వేశ్వర రావు, పి.విజయ్ కుమార్, సుబ్బారావు, సబ్బతి సత్యనారాయణ, అనురాధ, మురళీకృష్ణ, పుస్తక నిక్షిప్త కేంద్రం నిర్వాహకులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్